వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు పై న్యాయ పోరాటానికి సిద్ధం…. న్యాయవాది సాకా సత్తిబాబు

 

తుని.

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు రాజ్యాంగం లోని ఆర్టికల్ 341 కు వ్యతిరేకం గా ఇచ్చిన తీర్పు చెల్లదని బార్ అసోసియేషన్ ట్రెజరర్, న్యాయవాది సాకా సత్తిబాబు అన్నారు. రిజర్వేషన్ల పేరిట ఎస్సీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అంతటి తో ఆగకుండా అన్నదమ్ములు గా ఉన్న ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ పేరుతో విడగొట్టడానికి పూనుకున్నారని కులాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.ఎస్సీ వర్గీకరణ సున్నితమైన సామాజిక అంశమని దాన్ని ముట్టుకుంటే ప్రభుత్వాలు కూలడం ఖాయమని ఆయన అన్నారు. సుప్రీం తీరుపై అప్పీల్ కి వెళతామని న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!