సర్దార్ సర్వాయి పాపన్న జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం : మంత్రి సీతక్క.

 

 

సర్దార్ సర్వాయి పాపన్న జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం : మంత్రి సీతక్క.

ములుగు నియోజకవర్గం,ఆగస్టు 18,

అఖండ భూమి న్యూస్ . సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాల సందర్భంగా, ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొని, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తొ కలసి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి,జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరపడం చాలా సంతోషకరమని,

ప్రతి ఒక్కరూ మహనీయుల జీవిత చరిత్రను వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని మర్చిపోతే మాత్రం మానవ మనుగడకు భవిష్యత్తు కష్టతరం అవుతుందని, ఆయన జీవిత చరిత్ర మనకు ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో గౌడ్ అన్నల సమస్యలు పరిష్కరించడం కొరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్లు చూస్తానని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉందని ఒక మామూలు మనిషి తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదురించాలని, అప్పటి ప్రభువులు అధిక పన్నులు వసూలు చేస్తుంటే వారిని ఎదిరించి దాదాపు అనేక కోటలను తన ఆధీనంలోకి తెచ్చుకొని ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. గౌడన్న సమస్యలను తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు కాటమయ్య 100 రక్షక కవచాలు మంత్రి అందచేశారు.అనంతరం కలెక్టర్ కు మంత్రి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సి ఈ ఓ సంపత్ రావు, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, బి.సి. కులస్థులు, బి.సి. సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!