అనకాపల్లి జిల్లాలో విషాదం::ముగ్గురు విద్యార్థులు మృతి
అనకాపల్లి జిల్లా: ఆగస్టు19 అఖండ భూమి వెబ్ న్యూస్
అనకాపల్లి జిల్లా కోట ఊరుట్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. అనుమతుల్లేని హాస్టల్లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు సోమవారం ఉదయం మృతి చెందారు.
కైలాసపట్నంలో పాషా ట్రస్ట్ పేరుతో అనుమతుల్లేని హాస్టల్ నడుపుతున్నారు కిరణ్ కుమార్ అనే వ్యక్తి. ఇందులో 86 మంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఎస్టీ విద్యార్థిని విద్యార్థులు వసతి పొందుతున్నారు.
ఇక్కడ వసతి పొందుతూ సమీప ప్రభుత్వ పాఠశాల లో విద్యనభ్యసిస్తున్నారు. శనివారం రాత్రి భోజనాలు చేసి నిద్రించిన పిల్లలకు ఆదివారం తెల్లవారు జామున ఏడుగురికి వాంతులు అయ్యాయి.
దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అం దించి వారి పేరెంట్స్‌తో ఇళ్లకు పంపించారు. మొ త్తం 27 మంది వాంతులతో అస్వస్థతకు గురవగా..
కొంతమంది ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు మొత్తం 86 మంది పిల్లలు. ఇంటికి వెళ్లిన తర్వాత సోమవారం తెల్లవారుజా మున ముగ్గురు పిల్లలు చనిపోయినట్లుగా సమాచారం..
విద్యార్థుల సమాచారం తెలుసుకున్న స్థానిక మండల విద్యాధికారి శ్రీ జోష్, డి ప్యూటీ తహశీ ల్దార్, హాస్టల్ వివరాలు సేకరించారు. హాస్టల్ నిర్వాహకుడు కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేసి, హాస్టల్‌ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..