ఉపాధి సిబ్బందిపై వేటు..

 

 

ఉపాధి సిబ్బందిపై వేటు..

కర్నూలు ఆగస్టు 24 అఖండ భూమి వెబ్ న్యూస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను భారీగా దుర్వినియోగం చేసిన ఉపాధి సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వెల్దుర్తి మండలం లో 2023 24 లో జరిగిన ఉపాధి పనులపై నిర్వహించిన సామాజిక తనికెలపై ఇటీవల ఓపెన్ ఫోరం నిర్వహించారు ఉపాధి పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు వెలుగు చూసింది రూ 50 లక్షల పైగా ఉపాధి పనులు నిధుల దుర్వినియోగం జరిగినట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడి అయింది దుర్వినియోగమైన మొత్తం రికవరీ చేయాల్సి ఉండగా ఓపెన్ ఫోరంలో రూ ఆరు లక్షలు రికవరీ మాత్రమే ఆదేశించారు దుర్వినియోగానికి బాధ్యు లైన ఏపీఓ, ఈసీ తో పాటు ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు (టి ఏ) ఒక కంప్యూటర్ ఆపరేటర్( సిఓ) నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్ ఎ) 10 మంది ఉపాధి సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమర్నాథరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

Akhand Bhoomi News

error: Content is protected !!