వాటర్ ట్యాంకును ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి… గోవర్ధనగిరి ఎస్సీ కాలనీ వాసులు.
వెల్దుర్తి ఆగస్టు 26 (అఖండ భూమి) : మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో ఎస్సీ కాలనీలోని మాల వీధి నందు వాటర్ ట్యాంకును ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎస్ గిడ్డయ్య అను అతను వాటర్ ట్యాంకును ధ్వంసం చేసినట్లు గ్రామానికి చెందిన రామేశ్వరీ వెంకటలక్ష్మి తిమ్మక్క సుంకేశ్వరిలు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎందుకు ఇలా చేశావు మన కాలనీకి సౌకర్యంగా ఉన్నటువంటి వాటర్ ట్యాంకును పగలగొట్టినావు అని అడిగితే. ఆడవాళ్లు అని చూడకుండా అమ్మనా బూతులు తిడుతున్నాడనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటర్ ట్యాంక్ లేకపోవడంతో తాగునీరు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విలేకరులకు తెలిపారు. దీంతో వాటర్ ట్యాంకును పగలగొట్టడంతో ప్రభుత్వా ఖజానాకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. వాటర్ ట్యాంకు పగలగొట్టిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకుని మా కాలనీలో ట్యాంక్ ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..