డబుల్ బెడ్ రూంల కాలనీలో బోరు వేయించిన మున్సిపల్ చైర్ పర్సన్డబుల్ బెడ్ రూంల కాలనీలో బోరు వేయించిన మున్సిపల్ చైర్ పర్సన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 27 (అఖండ భూమి):
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీలో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం మంచినీటి సౌకర్యార్థం బోర్ వేయించారు.డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు నీటి సమస్యను ఆమె దృష్టికి తీసుకురావడం వల్ల డబుల్ బెడ్ రూమ్ ల వద్ద నీటి సమస్యను తీర్చడానికి మున్సిపల్ చైర్మన్ కొబ్బరి కొట్టి బోర్ వేయించడం జరిగింది..అనంతరం మున్సిపల్ చైర్మన్ చెట్లు నాటారు. ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పర్యావరణాన్ని కాపాడిన వారమౌతామన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. త్వరలోనే పై అధికారులతో చర్చించి ఇండ్ల పట్టాలు వచ్చేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, పాత శివ కృష్ణమూర్తి, పంపరి లత శ్రీనివాస్, వనిత రామ్మోహన్, మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్, మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం