ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ కు తలసేమియా అవార్డులు

 

ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ కు తలసేమియా అవార్డులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 1 (అఖండ భూమి):

కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ కు తలసేమియా అవార్డులను ఆదివారం అందజేచేశారు.తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాల ఏర్పాటు చేసి వారి ప్రాణాలను కాపాడిన కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ లకు ఉత్తమ మోటివేటర్ మరియు రక్తదాతల అవార్డులను ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ సంగీత పాఠక్, అపూర్వ గోష్,కోటపాటి రత్నావళిలు అవార్డు గ్రహీతలు డాక్టర్ బాలు,డాక్టర్ వేదప్రకాష్,జమీల్,గంప ప్రసాద్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,వెంకటరమణ ఈ రోజు శివరాంపల్లిలో గల తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో అందుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 3500 యూనిట్ల రక్తాన్ని అందజేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం జరిగిందని,భారత దేశంలోనే మొట్టమొదటి స్వచ్ఛంద సేవా సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ కు గుర్తింపు రావడం జరిగిందని,తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి వారి ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తామని అన్నారు.రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలకు,ఎంతగానో సహకరిస్తున్న మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!