అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు — జిల్లా ఎస్పీ సింధు శర్మ

 

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు

—– జిల్లా ఎస్పీ సింధు శర్మ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 1 (అఖండ భూమి:)

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని,పోచారం ప్రాజెక్టకు భారీగా వరద నీరు రావడంతో సాయంత్రం వరకు నిండి పొంగిపొర్లే అవకాశం ఉన్నందున చుట్టుపక్క ప్రజలు మరియు నాగిరెడ్డిపేట్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్, మండల ప్రజలు మరియు ముంపు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,అత్యవసరమైతే డయల్ 100 నకు లేదా 8712686133 ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు, వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నందున.కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు.సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు.జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు మరియు చెరువులు,వాగులు,నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేసారు.వరదల్లో చిక్కుకుని ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి జిల్లా పోలీస్ శాఖ తరపున 24×7 అందుబాటులో ఉండేవిధంగా బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు.ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు వారి సేవలను పొందాలని కోరారు.ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసు వారు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్

Akhand Bhoomi News

error: Content is protected !!