వెల్దుర్తి ఆగస్టు 01 (అఖండ భూమి) : తుఫాన్ ప్రభావంతో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి డి ఎం ఎం హెచ్ ఓ ఎల్ భాస్కర్ అన్నారు. ఆదివారం వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులను పరిశీలించడం జరిగింది. వైద్యశాల డాక్టర్లతో సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. వార్డు వార్డు పరిశీలించి రోగులకు వచ్చిన జబ్బుల విషయంలో కేసిట్ పరిశీలించి జబ్బుకు గల కారణాలను ఆరదిశారు. ప్రతిరోగికి సంబంధించిన మెడిసిన్ సక్రమంగా అందించాలని డాక్టర్లకు ఆదేశాల్లో జారీ చేశారు. ఇంటి పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాలలో ఎక్కడ కూడా నీటిని నిల్వ ఉండకూడదని తెలిపారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ ఆయిల్ చల్లడంతో దోమలు వృద్ధి చెందవని పేర్కొన్నారు. వాతావరణం మార్పులు కారణంగా నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాత త్రాగడం వలన డెంగు మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యాలాంటి రోగాలను దరిచేరనీయకుండా కాపాడుకోవచ్చని సూచనలు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా గ్రామాలలో హెల్త్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేస్తారని తెలిపారు. రోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. వైద్యపరంగా ఆరోగ్య సిబ్బంది ప్రజలకు ఎటువంటి అవగాహన సదస్సులు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు చేయడం లేదని ఓ విలేఖరి ప్రశ్నించిన దానికి సమానంగా అవగాహన సదస్సులు తప్పనిసరిగా చేస్తామని తెలపడం జరిగింది. ఆరోగ్యపరంగా స్వతహాగా ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు చేసుకోవడం వలన ఎంతో మంచిదని తెలపడం జరిగింది. స్థానిక వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
ANDHRA BREAKING NEWS HEALTH NEWS PAPER