గొలుగొండ
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండలంలోని కసిమి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలకు గేదెల రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రాంత ప్రజల కొరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, గొలగొండ మండల యూత్ అధ్యక్షులు వాసు వెంకటేష్, బోయిన చిరంజీవి, ఐటీడీపీ అల్లు నరేష్, కసిమి పంచాయతీ అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ప్రజా విజయోత్సవ రైతు పండుగ తరలి వెళ్లిన. తుర్కపల్లి మండల రైతులు.
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
-
బాల్య మిత్రులను కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే.బీర్లఐలయ్య
-
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య