“గూడెం లక్ష్మణ్ “”సాగిన బుజ్జిబాబు ”
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి)
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 56వ పుట్టినరోజు వేడుకలు కొయ్యూరు మండలంలో రాజేంద్ర పాలెం ,రావాణాపల్లి, ఆడాకుల, శరభన్నపాలెం , రత్నంపేట తోపాటు వివిధ గ్రామాల్లో జనసైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. మండలంలో రాజేంద్రపాలెం గ్రామంలో బూత్ కమిటీ చైర్మన్ సాగిన బుచ్చిబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గూడెం లక్ష్మణ్ , బూత్ కమిటీ చైర్మన్ సాగిన బుచ్చిబాబు, మండల మహిళా అధ్యక్షురాలు సెగ్గే భావన సాయి జయంతి మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడిని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలాగేరాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను చూడాలన్నది జనసైనికుల ఆకాంక్ష అని వారు అన్నారు. మన్యంలో జనసేన పార్టీని అభివృద్ధి పరిచేందుకు అరకు పార్లమెంట్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య ఎనలేని కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ పీటా సుధీర్ బాబు, గూడెపు శేషుబాబు , దుచ్చరి రమేష్, జుర్రా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



