వరి పంట పొలాలని పరిశీలించిన తాసిల్దార్…
ఎస్ రాయవరం మండలం సెప్టెంబర్ 2 అఖండ భూమి మండలంలో రాయవరం
గ్రామం శివారులో వరి పొలాలను మండల తహసీల్దార్ విజయ కుమార్,మండల వ్యవసాయాధికారి సౌజన్య,ఏ ఈ ఇరిగేషన్ సందర్శించడం జరిగింది. రైతులకు కొన్ని సూచనలు చేయడమైనది నీట మునిగిన పొలాలు త్వరగా పుంజుకోవడానికి 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా + 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. తరువాత లీటరు నీటికి 2 గ్రా.కార్బెండిజం+మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.
పిలకలు కట్టే దశలో నీరు బయటకు తీసిన వెంటనే ఎకరాకు 20 కిలోల యూరియా + 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటు గా వేయడం వల్ల పంట త్వరగా పుంజుకుంటుంది మరియు నష్టంచాలావరకు తగ్గుతుంది.
ఈ వాతావరణం లో ఆశించే తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 1 గ్రా’కార్బెండిజం లేక 2 గ్రా. కార్బెండిజం + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి. రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



