హోంమంత్రి అనిత ..సమయం @ అర్ధరాత్రి.. 12.15 గం.లు*

 

అమరావతి సెప్టెంబర్ 2 అఖండ భూమి న్యూస్
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వరద బాధితులకు అండగా నిలవడమే లక్ష్యంగా నిర్విరామంగా బాధ్యత నెరవేరుస్తున్నారు. వరదల్లో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్న వందలాది మంది ప్రజలకు దగ్గరుండి ఆహారాన్ని పంపిణీ చేసే పనులను నిరంతరం పరిశీలిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు సిద్ధార్థ్ జైన్, వీరపాండ్యన్ వంటి అధికారులతో చర్చలు జరుపుతూ వస్తున్న ఆహారం, ప్రజలకు చేరవలసిన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆహార పొట్లాలలో నీరు సహా అన్ని ఉండేలా సమకూరుస్తున్నారా లేదా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సహచర మంత్రి కొల్లు రవీంద్రతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తున్నారు. తినడానికి కూడా సమయం చాలక తన కారులోనే భోజనం చేస్తూ..నిమిషాల్లో పూర్తి చేసి ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఆకలి బాధ లేకుండా ఒక్క మెతుకూ వృథా కాకుండా ప్రతి ఒక్కరం బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలంటూ ఆటోలలో ఆహారాన్ని పంపుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!