కోటనందూరులో రాక్స్ ఫైట్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ సమావేశం.

కోటనందూరు మండలంలో రాక్స్ ఫైట్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అనే అంశం రాజకీయ కుట్ర అని మాల మాదిగలను విడదీయడానికి వేసే పన్నాగమని ఆయన అన్నారు. వర్గీకరణ అంశం ను గూర్చి ఆయన ప్రజలకు విపులంగా వివరించారు.ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు చేపడతామని ఆయన తెలిపారు. వర్గీకరణకు వ్యతిరేకంగా రాక్స్ ఫైట్ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు విస్తృతంగా నిరవధిక పోరాటాలు చేపడుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దారకొండ జోగురాజు, నూకరాజు, గంటా జోగురాజు,సర్పంచ్ జగటాల వీరబాబు, కొత్తపల్లి మాణిక్యాలరావు, గర్సింగు శ్రీను, అల్లంపల్లి నర్సింహమూర్తి, చిట్టుమూరి శివ, జిగటాల కోట సత్తిబాబు, దెండేటి , అడ్వకేట్ కొండ్రు కళ్యాణ్, నేతల శివ, చిట్టిమూరి రవి, అంగుళ్ల నాగేశ్వరరావు, రావాడ రాజు, తోలెం విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!