ఘన్పూర్లో ఘనంగా ఊర పండగ.. -కులమతాలకు అతీతంగా పాల్గొన్న గ్రామస్తులు.. -గత 76 సంవత్సరాలుగా జరుగుతున్న ఊర పండగ..

 

 

ఘన్పూర్లో ఘనంగా ఊర పండగ..

-కులమతాలకు అతీతంగా పాల్గొన్న గ్రామస్తులు..-

గత 76 సంవత్సరాలుగా జరుగుతున్న ఊర పండగ..

 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్: 22 (అఖండ భూమి)

నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలోని ఘన్పూర్ గ్రామస్తులు గత 76 సంవత్సరాల నుండి కులమతాలకు అతీతంగా ఊర పండుగను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఆదివారం ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలను చక్కగా అలంకరించి. ఊరేగించి గ్రామస్తులందరూ మొక్కులు తీర్చుకున్నారు. ఊర పండుగను చూడడానికి ఇతర గ్రామాల నుండి ప్రజలు తరలి వచ్చారు. ఊరు. వాడ. గొడ్డు. గోధ. పిల్ల పాప చల్లంగా ఉండి వర్షాలు సమృద్ధిగా కురిసి పంట పొలాలు బాగా పండాలని గ్రామస్తులు కోరుకుంటారని. గ్రామదేవతల ఊరేగింపు తర్వాత ఇళ్లను శుభ్రం చేసి అలుకుచల్లి ఇంటి ఎదుట ముగ్గు వేస్తారని. పండుగ రోజు గ్రామస్తులందరూ పిల్లాపాపలతో. బంధువులతో ఉత్సాహంగా గడుపుతామని. గత 76 సంవత్సరాల నుండి శివ పార్వతి పుత్రుడు గణేష్ నిమజ్జనం తర్వాత ఈ ఊర పండుగను నిర్వహిస్తామని గ్రామ పెద్ద మనుషులు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!