జూలై 23 రిపోర్టు వస్తే, ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు?
జగన్ దిష్టిబొమ్మ అవగాహన లోపమే- ఎంపీపీ బడుగు రమేష్
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) సెప్టెంబర్ 22
హిందువులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు లో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు కొత్త ఆలోచనలు తెరపైకి తెచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఎంపీపీ బడుగు రమేష్ అన్నారు. జూలై 9న లడ్డు శాంపిల్స్ పరీక్షకు పంపి, 23న రిజల్ట్ వస్తే ఇంతవరకు నిజనిర్ధారణ కమిటీ వేయకుండా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ఎంపీపీ ప్రశ్నించారు. 100 రోజుల్లో ఏమీ చేయలేని కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించడానికి లడ్డును తెరపైకి తెచ్చిందని అన్నారు. లడ్డును సాంప్రదాయబద్ధంగా ఒక ప్రణాళిక ప్రకారం తయారు చేస్తారని దానిలో బయట భక్తుల ప్రమేయం లేదని కూటమినేతలకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. లడ్డులో అవినీతి జరిగితే టీటీడీ నుంచి రావాల్సిన ప్రెస్ నోట్, టిడిపి కార్యాలయం నుంచి రావడం ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లడ్డులో జరిగిన అవినీతిపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేస్తూనే, దీనిపై అవగాహన లేని కొంతమంది కూటమి నేతలు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాము తలుచుకుంటే మండలంలోని గ్రామ గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునియ్యగలమని ఎంపీపీ బడుగు రమేష్ హెచ్చరించారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం