ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలగా మార్పిడి చేయండి.. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబుకు వినతి..
వెల్దుర్తి సెప్టెంబర్ 23 (అఖండ భూమి) : వెల్దుర్తి ఏబీఎన్ చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వ పాఠశాల గా మార్పిడి చేయాలని గ్రామానికి చెందిన తిమోతి, సుంకన్న, దేవరాజు, పెద్దన్నలు సోమవారం మండల పరిధిలోని బోగోలు గ్రామంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఎయిడెడ్ స్కూల్ గా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలగా మార్పిడి చేయాలని ఎమ్మెల్యే కేఈ శామ్ బాబును కోరారు. ఇందులో భాగంగా వెల్దుర్తి గ్రామ పెద్దలు బొమ్మన దశరథ రామ్ రెడ్డి ఎయిడెడ్ స్కూల్ మార్పిడి కొరకు 30 సెంట్ల స్థలాన్ని ఇచ్చి, రెండు షెడ్లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు వచ్చే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి చెబుతామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఎస్సీ కాలనీకి చెందిన యువకులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం