కపిలేశ్వరపురం లో డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్
డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ వర్గీకరణ వ్యతిరేఖ పోరాట ఉద్యమంలో భాగం గా “రాక్స్ ఫైట్” వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమ సమితిని స్థాపించి, గ్రామల్లో పర్యటిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలను వర్గీకరణ వ్యతిరేఖ పోరాటం అంశం పట్ల చైతన్య పరుస్తున్న సంగతి అందరికీ విధితమే. ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామాలు లో పర్యటించిన రత్నాకర్ వర్గీకరణ నష్టాలు, రాజకీయ కుట్రలు అనే అంశాలపై వివరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ జాతిని ఉత్తేజపరుస్తూ మేలుకొలుపుతున్నారు. అందులో భాగంగా కాలేరు గ్రామంలో ప్రజలతో మమేకమై వర్గీకరణను వ్యతిరేకించాలని పోరాటం ద్వారానే అది సాధ్యమని తెలియజేశారు. అంతేకాకుండా రాజకీయ నాయకుల కుట్రలకు బలికాకుండా జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.