గ్రంథాల రచనకూ జర్నలిస్టులు పోటీపడాలి! డా.శివాజీ, డా.శారద సూచన

 

గ్రంథాల రచనకూ జర్నలిస్టులు పోటీపడాలి!

డా.శివాజీ, డా.శారద సూచన

గుంటూరు, అక్టోబర్ 3: అఖండ భూమి వెబ్ న్యూస్  రంగంలో స్థిరపడిన జర్నలిస్టులు కేవలం వార్తా సేకరణకే పరిమితం కాకుండా, తమ అనుభవాలను రంగరిస్తూ భావితరాల కోసం వ్యాస, గ్రంథ రచనలూ చేయాలని రైతునేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డా.యలమంచిలి శివాజీ, ప్రముఖ సంపాదకులు కీ.శే.నార్ల వెంకటేశ్వరరావు కుమార్తె, మాజీ మేయర్, విజిటిఎం ఉడా మాజీ చైర్ పర్సన్ డా.కొల్లి శారద సూచించారు. 1992నాటికే ప్రముఖుల ప్రశంసలు పొందిన కృష్ణా జిల్లా రైతు కుటుంబానికి చెందిన దాసరి ఆళ్వారస్వామి, గత 46ఏళ్లుగా పత్రికా రంగంలో కొనసాగుతూ ఇప్పటికి వందకు పైగా వివిధ పత్రికల్లో పలు రంగాలకు చెందిన 6వేల మంది ప్రముఖుల కథనాలు రాశారు. ‘పాత్రికేయ రంగంలో నా అనుభవాలు’ పేరిట తాజాగా తన 52వ గ్రంథాన్ని 360 పేజీలతో ప్రచురించారు. ఈసందర్భంగా గురువారం గుంటూరులో డా.శివాజీ, డా.కొల్లి శారద, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రీసెర్చ్ విభాగం (లాం ఫారం) డైరెక్టర్ డా.పివి.సత్యనారాయణరావుని కలిసి తన గ్రంథం ప్రతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి.రాఘవాచారి ఏపీ మీడియా అకాడమీ విశ్రాంత కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర తిలక్, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ.. ‘పాత్రికేయ జీవితం వడ్డించిన విస్తరి కాదు’, ‘కష్టాలు – కడగండ్లు’, ‘కత్తి మీద సాము విలేకరి వృత్తి’.. ఇలా అనేకానేక వాస్తవిక అంశాలతో మంచి-చెడులపై ఆళ్వారస్వామి తన గ్రంథాల్లో నిర్మొహమాటంగా అభిప్రాయాల్ని వెలిబుచ్చారని ప్రస్తుతించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!