తుని మండలం డి.పోలవరం, కొలిమేరు, వెంకటాపురం గ్రామాలలో రాక్స్ అధినేత డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ పర్యటించారు. ఎస్సీల వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గురువారం తుని నియోజకవర్గంలో పర్యటించి వర్గీకరణ వలన ఎస్సీలకు జరిగే అన్యాయాలను, ప్రభుత్వాల కుట్రలను గూర్చి వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచారు. గ్రామాలలో యువకులు, పెద్దలు, మహిళలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారుకు దేశంలోని మాలలు తగిన బుద్ధి చెబుతారని పది లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించి మాలల సత్తా ఏంటో కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె.కళ్యాణ్, మండల కోఆర్డినేటర్ నేతల శివ, ప్రచార కార్యదర్శి దాసు, సర్పంచ్ జగటాల వీరబాబు, సత్తిబాబు, పృద్వి, జ్యోతి బాబు, నెమ్మాది నూకరాజు, జక్కల వెంకటరమణ, బాలకృష్ణ, విజయ్, జి శ్రీనివాస్, జాన్, జయరాజు, చెరుకూరి లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

ANDHRA NEWS PAPER STATE

