కోటనందూరు. అక్టోబర్ 11 అఖండ భూమి
కోటనందూరు మండలంలో రాక్స్ అధినేత డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ గారి ఆదేశాల మేరకు నూతన కార్యవర్గం ను నియమించారు. ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ పోరాట గర్జన (రాక్స్) పేరుతో వర్గీకరణ పై వ్యతిరేక పోరాట ఉద్యమం చేసేందుకు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అనేక గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై, ప్రజలను చైతన్య పరుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కోటనందూరు మండలంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షునిగా ముక్కుడుపల్లి బాబురావు, ఉపాధ్యక్షునిగా అల్లు రాజబాబు, సెక్రటరీగా దిండేటి పృద్వి, కన్వీనర్ గా తోలెం విజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిట్టిమూరి శివ, కోఆర్డినేటర్ గా నేతల శివ ను డాక్టర్ రత్నాకర్ నియమించారు. వారిరువురికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.


