శ్రీ కనదుర్గ అమ్మవారి నవరాత్రులలో విజయదశమి రోజున శ్రీరాజరాజేస్వరీదేవిగా అవతరించి భక్తులకి దర్శనం ఇచ్చిన అమ్మవారు.
కాకినాడ అక్టోబరు12 (అఖండ భూమి) కాకినాడ మహాలక్ష్మి నగర్ లో వేంచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రుల్లో విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి గా అవతరించి భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు-కుంకుమార్చనలు నిర్వహించిన ఆలయ అర్చకులు
శిష్టు సాయిరాం శర్మ.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ అమ్మవారు నవరాత్రి-మహోత్సవాలలో విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా సకల-భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత గా పూజలందుకుంటుందని,శ్రీరాజరాజేశ్వరి దేవి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి-ఇచ్చా-జ్ఞాన -క్రియా శక్తులను తన-భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుందని ఈమె యోగమూర్తి మాయా మోహిత మానవ మనో- చైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుందని,
దుష్టులను-దురహం కారులను శిక్షించుటకు అంకుశం-పాశం ధరించి ప్రశాంతమైన చిరునవ్వు-చల్లని చూపు భక్తులను అను గ్రహిస్తాయని
లలితా సహస్ర నామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన-చేయా లని అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ శ్లోకం పఠించాలని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ తెలిపారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..