ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు… కర్నూల్ ఆర్డిఓ సందీప్ కుమార్ 

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు…

కర్నూల్ ఆర్డిఓ సందీప్ కుమార్

వెల్దుర్తి అక్టోబర్ 18 (అఖండ భూమి) : ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకే అని కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని పుల్లగుమ్మి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు. అక్కడ రెవెన్యూ సదస్సులను రైతులు ఉపయోగించుకొని మీ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వెల్దుర్తి తాసిల్దార్ కార్యాలయం నందు పర్యవేక్షించి. రికార్డులను పరిశీలించారు. స్థానిక తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మతో మాట్లాడుతూ.. రీసర్వే జరిగిన గ్రామాలలో రైతుల సమస్యలు పరిష్కరించామన్నారు. రైతుల సమస్యలను 86 రోజుల లోపల పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీ సర్వే నిర్వహించిన గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించి రైతుల పాస్ బుక్కులలో ఉన్నటువంటి లోటుపాటులను సవరించేందుకే రెవెన్యూ సదస్సులను నిర్వహించామని తెలిపారు. పాస్ బుక్ ల మీద ఉన్నటువంటి బొమ్మలను తొలగించి, ఎల్పిజి నంబర్లను అటాచ్మెంట్ చేసి ఈ రైతులను ఇబ్బందులు పెట్టే విధంగా గత ప్రభుత్వం చేసినందువల్లే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని సవరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్డిఓ వెంట వెల్దుర్తి తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!