ఆత్రేయపురంలో రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్

ఆత్రేయపురంలో రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్

ఆత్రేయపురం మండలం వ్యాలీ, రాజవరం గ్రామాలలో రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్ పర్యటించారు. ఆయన అనేక రోజులుగా ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేఖంగా పోరాడుతూ అనేక గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ అలుపెరుగక నిరంతర కృషి తో కొనసాగుతున్నారు. అందులో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ మాలలపై జరిగే అన్యాయాలను, ఎస్సీల కుట్రపూరిత వర్గీకరణల వలన జరిగే నష్టాలను గూర్చి ఆ గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ చైతన్య పరిచారు. కొన్ని రాజకీయ పార్టీలు కులాలు జాతులు మధ్య చిచ్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. మరోసారి మాలల జోలికి రాకుండా ఉండాలంటే మాలలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీనైనా భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, దళిత నాయకులు, యువకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!