బాల్య మిత్రులను కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే.బీర్లఐలయ్య
యాదగిరిగుట్ట మండలం. నవంబర్ 26 అకాండ భూమి.
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలోని తన చిన్ననాటి పాఠశాల స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల లో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం విచ్చేసిన సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఎస్ఎస్సి బ్యాచ్ 1989. 90 బ్యాచ్ కి చెందిన తన తోటి స్నేహితులతో తన చదువుకున్న బెంచ్ లో కూర్చుని స్నేహితులతో ఆనందం వ్యక్తం చేసి చిన్ననాటి జ్ఞాపకాలతో నెమలి వేసుకుంటూ కొద్దిసేపు వారితో మాట్లాడినారు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఒక నిరుపేద వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన నేను మా నాన్నగారు నా బాల్యంలో నే చనిపోయారు. ఎంతో కష్టపడి చదువుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినానంటే అది ప్రజల నమ్మకం ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేసినందుకు వారికి కృతజ్ఞతలు అని నేను ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు.మా గ్రామం సైదాపురం గ్రామం నేను చదువుకున్నది మా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు మాసాయిపేట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశానని అన్నారు అనంతరం స్నేహితులతో ఫోటో సెల్ఫ్ దిగినారు .ఈరోజు ఈ పాఠశాలలో చదువుకున్న నేను పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని నా స్నేహితులను కలవడం చాలా ఆనందంగా ఉందనిఆలేరు ఎమ్మెల్యేబీర్ల ఐలయ్య అన్నారు.