ఎస్సీల కుల గణన లిస్ట్ లో అన్నీ తప్పులే – అభ్యంతరం తెలియజేసిన ఎస్సీ నాయకులు
కోటనందూరు మండలం (అఖండ భూమి) డిసెంబర్ 31
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌సి కుల గణన (సామాజిక, ఆర్థిక, విద్య) పై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేపట్టిన సర్వే డేటా లో అనేక తప్పుడు సమాచారం ఉందని మండల ఎస్సీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ డేటా సర్వే నుంచి సేకరించింది కాదని అలా సేకరిస్తే అన్ని తప్పులు వచ్చేవి కాదని ఆమోదయోగ్యంగా లేదని వాపోయారు. దీనిపై ఎస్సీ నాయకులు కోటనందూరు మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. జాబితాలలో కులాలతోపాటు సామాజిక, ఆర్థిక, విద్య అంశాలలో వందలాది తప్పులు ఉన్నాయని తెలియజేశారు. అంతేకాకుండా చాలామంది పేర్లు వారి సమాచారం లేదన్నారు. దీనిపై కోటనందూరు మండల తహసీల్దార్ స్పందిస్తూ పోర్టల్ లో కులాల మార్పుకు సంబంధించి ఆప్షన్ మాత్రమే ఉందని మిగిలిన వాటి ఆప్షన్ ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు.దీనిపై ఎస్సీ నాయకులు స్పందిస్తూ గ్రామాలలో తిరిగి కులగణన సర్వే నిస్పక్షపాతంగా చేపట్టాలని ఇలా తప్పుడు సమాచారంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, కాబట్టి కచ్చితంగా గ్రామాలలో రీసర్వే చేపట్టాలని తహసీల్దార్ ను కోరారు. కాగా తుది జాబితాను జనవరి 10న ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది.