తప్పుడు సర్వే నివేదికలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలి. న్యాయవాది కొండ్రు కళ్యాణ్

తప్పుడు సర్వే నివేదికలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలి..   – న్యాయవాది కొండ్రు కళ్యాణ్

కోటనందూరు మండలం జనవరి 3. 2025 (అఖండ భూమి)

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుచున్న సోషల్ ఆడిట్ మరియు ఎస్సీల కుల గణన లో భాగంగా సచివాలయాల లో ప్రచురించిన జాబితా లో ఎస్సీల యొక్క ఉపకులాలు, సామాజిక, ఆర్థిక, విద్య లాంటి ముఖ్యమైన అంశాలలో అనేక తప్పులు ఉండడంతో అల్లిపూడి  గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లిపూడి లో తహశీల్దార్ కి  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ మాట్లాడుతూ జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని మాలకు బదులుగా మాదిగ అని, మాదిగ కు బదులుగా మాల అని, రెల్లికి బదులుగా మాల అని,మాలకు బదులుగా రెల్లి అని, అరవమాలని అనేక తప్పులు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా అనేకమంది పేర్లు కనిపించకుండా పోయాయని న్యాయవాది కొండ్రు కళ్యాణ్ తెలియజేశారు. కొన్ని చోట్ల పేర్లు లేకుండా సమాచారం మాత్రమే ఉందని ఈ జాబితాను తప్పుగా సర్వే చేసి తప్పుడు సమాచారం తో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు జాబితా లోని తప్పులు సరిచేసి సమగ్రమైన ఖచ్చితమైన రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా కోరుతూ కోటనందూరు మండల తహసీల్దార్ టి. సుభాష్ కి న్యాయవాది కొండ్రు కళ్యాణ్ ఆధ్వర్యంలో నెమ్మది సత్యనారాయణ, చిటుమూరి చినకొండ , దుత్తర్తి అచ్చిరాజు, మారే బాబ్జి, తదితరులు వినతి పత్రాన్ని అందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!