ఘనంగా గణతంత్ర స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

 

 

ఘనంగా గణతంత్ర స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

వెల్దుర్తి జనవరి 26 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు ఆదివారం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు రిపబ్లిక్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయం ఎదుట తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి సుహాసనమ్మ ఆధ్వర్యంలో ఎంపీపీ రంగన్న, జడ్పిటిసి దాటిపోగు సుంకన్న జెండాను ఎగరవేసి వందనం చేశారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్, సీఐ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అదేవిధంగా నందు ఎస్సై జి.అశోక్ లు సిబ్బందితో జెండా ఎగరవేసి జెండాకు వందనం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!