ఉత్తమ బి ఎల్ ఓ కి ఉత్తమ గ్రహీత అవార్డు..వె
ల్దుర్తి జనవరి 30 అఖండ భూమి వెబ్ న్యూస్ : మండల పరిధిలోని పిక్కిలివాని పల్లె గ్రామంలో వీఆర్వో గా విధులు నిర్వహిస్తూ బి ఎల్ ఓ గా అవార్డు గ్రహీతగా ప్రశంస పత్రాన్ని విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా అవార్డు పొందారు. ఈ సందర్భంగా వెల్దుర్తి మండల తాసిల్దార్ కార్యాలయం నందు గురువారం తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ ఆధ్వర్యంలో వీఆర్వో సిబ్బంది అవార్డు గ్రహీత అయినటువంటి పిక్కిలివాని పల్లె వీఆర్వోఓ సిటీ కృష్ణమూర్తికి శాలువా కప్పి పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు రమణారెడ్డి, రామకృష్ణ, కేకే మదిలేటి, మౌలాలి, వాణి, ప్రసాద్ బాబు, ఉమన్న, వెంకటేశ్వర్లు, ఉమా, పద్మావతి, ప్రతాపు, అయ్యన్న, నాగన్న తదితరులు పాల్గొన్నారు.