మాజీ మున్సిపల్ ఛైర్మన్ పై కేసు నమోదు
బెల్లంపల్లి జనవరి 31(అఖండ భూమిన్యూస్):బెల్లంపల్లి మాజీ మున్సిపల్ ఛైర్మన్ మత్తమారి సూరిబాబుపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ వో దేవయ్య తెలిపారు.ఈ సందర్బంగా ఎస్ హెచ్ ఓ దేవయ్య మాట్లాడుతూ…జనవరి 29న పట్టణంలోని రెండవ వార్డు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చడానికి వచ్చిన తహసీల్దార్ జ్యోత్స్న విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడని ఆమె మాజీ చైర్మన్ సూరిబాబు పై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు.