మద్నూర్ లో ఘనంగా భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు

 

మద్నూర్ లో ఘనంగా భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు

బాన్సువాడ డివిజన్ ప్రతినిధి ఫిబ్రవరి 1(అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ మద్నూర్ మండల కేంద్రంలో శనివారం రోజున భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.శనివారం ఉదయము తెల్ల వారుజామున అభిషేకలు,పూజా, మంగళ ఆరతి నిర్వహించారు.ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం వరకు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ జయంతి ఉత్సవాలో మద్నూర్, డోంగ్లి మండలాల్లోని భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని మండల కేంద్రంలో గుండ విధులు నుండి బైక్ ర్యాలి తీయడం జరిగింది.అనంతరం అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో పద్మశాలి రాష్ట్ర జయింట్ సెక్రటరీ డాక్టర్ సుంకీవార్ రమన, మండల కార్యనిర్వాహకా అద్యక్షులు రచ్చ రచ్చ కుశాల్ కుమార్ ,కోశాదికారి హుష్కల్ వెంకుల్, అలయ కమిటి అద్యక్షులు నగనాథ్, కార్యదర్శి అంబట్ వార్ సంతోష్ సెట్, ఉపాద్యక్షులు సురేష్, మేత్రి రచ్చ నాగేశ్, మిడియ అద్యక్షులు సుంకీవార్ శ్రీధర్, అలయ కమిటి సబ్యులు శేషికాంత్, జగదీష్, కోసాదికరి ఉత్తుర్ వార్ శ్రీను , పూజారీలు మహేశ్ మహారాజ్, ఓం మహారాజ్, గోపి వారకరి భజన మండలి , పద్మశాలి కులబందువులు, నాయకులు, భక్తజనులు ఆదిక సంఖ్యలో పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!