నేడు లిల్లీపుట్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం..
-అవగాహన కల్పించనున్న మానసిక నిపుణుడు అడ్డిగ శ్రీనివాస్..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి: 30 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్ పట్టణం 25వ వార్డ్ యోగేశ్వర్ కాలనీ లోని లిల్లీపుట్ పాఠశాలలో శుక్రవారం మానసిక నిపుణుడు అడ్డిగ శ్రీనివాస్ విద్యార్థులకు మానసిక ఒత్తిళ్లు చెప్పినట్టు వినకపోవడం. చెడు అలవాట్లు. బద్ధకం. మొబైల్ వ్యసనం. చెప్పింది అర్థం కాకపోవడం లాంటి వ్యసనాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా ఆబ్సెంట్ కాకుండా పిల్లలను తీసుకురావాలని ఆయన కోరారు. విద్యార్థులకు ఈ అవగాహన ఎంతో ఉపయోగపడుతుందన్నారు.