ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా క్యాన్సర్ రోగంపై అవగాహన కల్పించిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు..

 

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా క్యాన్సర్ రోగంపై అవగాహన కల్పించిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు..

అమలాపురం-అఖండ భూమి:

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, దాని నివారణను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచ క్యాన్సర్ మహమ్మారిని పరిష్కరించడానికి చర్యలను సమీకరించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం.. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జె.సి.ఐ) అమలాపురం వారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పురుషుల్లో సాధారణంగా వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ గురించిన అవగాహన ప్రతులను అమలాపురం పట్టణంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన ఉద్యోగులకు, యజమానులకు అందజేసి ఈ వ్యాధిపై అవగాహన కల్పించారు.

ఈ వ్యాధి ఆఖరి దశకు చేరుకునే వరకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటి సంకేతాలు, లక్షణాలు చూపించవని, కొన్ని సందర్భాల్లో కొన్ని సంకేతాలను అంతర్లీనంగా ప్రోస్టేట్ క్యాన్సర్ సూచనలుగా భావిస్తారు అని తెలిపారు. మూత్ర విసర్జనలో నొప్పి లేదా మంటతో కూడిన నొప్పి, అంగస్తంభన పొందడానికి కష్టంగా ఉంటే, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం, వల్ల పురుషనాళం లేదా పొత్తికడుపు, తొడల లేదా తుంటి ప్రాంతాలలో నొప్పి వచ్చినా, చుక్కల చుక్కలుగా లేదా బొట్లు బొట్లుగా మూత్రం కారటం, మూత్రం యొక్క ప్రవాహాన్ని ప్రారంభించడంలో సమస్య వస్తే ఈ వ్యాధి సంకేతాలుగా గుర్తించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జె.సి.ఐ అమలాపురం అధ్యక్షురాలు శ్రీవాణి వాడ్రేవు, లక్ష్మీ నృసింహ, శ్రీరామ్, సెక్రటరీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!