శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం

 

శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం

అచ్చుతాపురం ఫిబ్రవరి 4 (అఖండ భూమి) :మండలం మడుతూరు గ్రామ శివారు ఎరికిరెడ్డి పాలెం నందు శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం ను ఆలయ ధర్మకర్త బళ్ళ వెంకు నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ తీర్థం సందర్భంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు ప్రథమ స్థానం విశాఖపట్నం, ద్వితీయ స్థానం ఎరికిరెడ్డిపాలెం ,తృతీయ స్థానం ఏటికొప్పాక జట్లు విజయం సాధించాయి. ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మోటూరు శ్రీవేణి చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. అనంతరం కోలాట నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బళ్ళ వెంకు నాయుడు, జమ్ముల అప్పలకొండ, జమ్ముల రాంబాబు జనసైనికులు బళ్ళ పవన్ కుమార్, వెల్లం శెట్టి శశి రావు, పందల శివ ,రామిడి మహేష్ ఎర్రంశెట్టి నాగేష్ ,బళ్ళ రాజు బాబు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!