మా 30 ఏళ్ళ పోరాట ఫలితమే ఎస్సి వర్గీకరణ.ఈ విజయం మాదిగ అమరవీరులకు అంకితం

 

మా 30 ఏళ్ళ పోరాట ఫలితమే ఎస్సి వర్గీకరణ.ఈ విజయం మాదిగ అమరవీరులకు అంకితం

మాదిగ హక్కుల దండోరా

బెల్లంపల్లి ఫిబ్రవరి 06(అఖండ భూమి న్యూస్ ):బెల్లంపల్లి కంటా చౌరస్తాలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సి వర్గీకరణ అమలు చేస్తానని మాట ఇచ్చిన సందర్బంగా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ చిలుక రాజనర్సు మాదిగ మాట్లాడుతూ…

మా 30 ఏళ్ళ పోరాట ఫలితమే ఈ ఎస్సి వర్గీకరణ,ఈ విజయం మాదిగ అమరవీరులకు అంకితం అని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ చిలుక రాజనర్సు మాదిగ పేర్కొన్నారు.

ముఖ్యంగా మాదిగల న్యాయమైన డిమాండ్.ఎస్సి .ఏబీసీడీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్ళు గా యావత్ మా మాదిగ జాతి.విద్య.ఉద్యోగ రాజకీయ,సంక్షేమ రంగాలలో.వెనకబాటు తనన్ని నిరసిస్తూ గల్లి నుండి ఢిల్లీ వరకు నిరంతరం ఉద్యమాలు చేశామని.ఆ ఉద్యమ ఫలితమే 01.ఆగస్టు.2024న మన దేశ అత్యున్నత న్యాయస్థానం.చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ నాయకత్వాన 7 గురు సభ్యుల ధర్మాసనం తీర్పు అన్నారు.ఈ సందర్బంగా వారికి మా మాదిగ జాతి *రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

మా 30 ఏళ్ళు న్యాయమైన ఎస్సి,ఏబీసీడీ వర్గీకరణ న్యాయమైందని సుప్రీమ్ కోర్టు తీర్పును వెలువరించిన వెంటనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పందించి నేనే మొదట ఎస్సి వర్గీకరణ అమలు చేస్తా అని మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఎస్సి వర్గీకరణ.చేపట్టిన ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

అలాగే. సీఎం రేవంత్ రెడ్డి నాయత్వములో మాదిగల హక్కులను కాపాడుతు అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు.

అదే కాకుండా ఎస్సి వర్గీకరణ కోసం తన భార్య పిల్లను వదులుకొని ఉద్యమం కోసం నిరంతరం ఉద్యమించిన ప్రతి ఒక్క మాదిగ బిడ్డదే విజయం మరి ముక్యంగా ఎవరి జనాభా దామాషా వారికి తగిన వాటా ఇవ్వాలని,

గత నెల ఆదిలాబాద్ కి వచ్చిన ఏక సభ్య కమిషన్ షామీమ్ అక్తర్ కి తెలియ పరచడం జరిగింది.70% ఉన్న మాదిగలకు 11% వాటా ఇవ్వాలని డిమాండ్ చేయాలని

డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఎస్సి వర్గీకరణ కోసం తమ భార్య పిల్లను వదులుకొని తమ కుటుంబాన్ని సైతం వదులుకొని ఈ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన నా మాదిగ అమరవీరులకు ఈ విజయం అంకితం ఇస్తున్నామన్నారు.

ఈ ఎస్సి వర్గీకరణ ఉద్యమానికి పూర్తి సహకారం అందించిన రాజకీయ పార్టీలు టీడీపీ.బీజేపీ.కాంగ్రెస్. బిఆర్ఎస్ పార్టీలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

మరి ముఖ్యంగా మా ఈ ఉద్యమానికి అన్ని విదాలుగా సహకించి మా ఉద్యమాన్ని ముందుకు నడిపిన యావత్ సమాజానికి మా మాదిగ జాతి పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!