యువకుడిపై బీరు సీసాలతో డాడీ

 

యువకుడిపై బీరు సీసాలతో డాడీ

బెల్లంపల్లి ఫిబ్రవరి 08(అఖండ భూమి న్యూస్)మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్టేక్స్ ఏరియాలోని బార్ అండ్ రెస్టారెంట్ లో శుక్రవారం రాత్రి తాగిన మైకంలో ఒకరిపై డాడీ చేసారు.బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన అల్లి సాగర్ అతని మిత్రులు కల్సి కాల్ టెక్స్ట్ లోని బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం సేవిస్తున్నారు. అదే బార్ లో పక్కన తాండూర్ కు చెందిన బండారి వంశీ అనే వ్యక్తి కూడా మద్యం సేవిస్తున్నాడు,వారి మధ్య మాట మాట పెరిగి అల్లి సాగర్ అతని మిత్రులు బీర్ సీసాలతో బండారి వంశీ పై దాడి చేసారు.ఈ ఘటనలో బండారి వంశీకి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వంశీని బెల్లంపల్లి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.బాధితుడు ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపారు…

Akhand Bhoomi News

error: Content is protected !!