అంబరాన్నంటిన బిజెపి సంబరాలు..
-ఢిల్లీలో 27 సంవత్సరాల తరువాత బిజెపి ఘనవిజయం..
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు శనివారం గాంధీ చౌక్ లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. 27 సంవత్సరాల తర్వాత కేజ్రీవాల్ పై రాజధాని ఢిల్లీలో బిజెపి పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన కేజ్రీవాల్ ఆప్ పార్టీనీ ప్రజలు తిరస్కరించి. మోడీ చేస్తున్న అభివృద్ధినీ చూసి బిజెపి పార్టీకి పట్టం కట్టారని. దేశంలో మోదిహవ కొనసాగుతుందని. మోదీ హవాలో ఏ పార్టీ అయినా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరిస్తారని. సంస్థ గత ఎన్నికల్లో బిజెపి పార్టీది అంతిమ విజయమని వారు అభివర్ణించారు. ఈ వేడుకల్లో సొసైటీ డైరెక్టర్ షక్కర్ల బాలకిషన్. కంచి నవార్ యాదవ రావు. షక్కర్ల వార్ నరేష్. గోపాన్ వార్ శివాజీ. కార్యకర్తలు పాల్గొన్నారు.