5 కొత్త జంటలకు లక్ష రూపాయలు పెళ్ళికానుకలు అందించిన జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 16: స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా 5 కొత్త జంటలకు ఒక్కొక్క జంటకు 20 వేల రూపాయలు చొప్పున 1,00000 రూపాయలు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ పెళ్లి కానుకలు అందించారు. గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన నాగదేవి కి, గోపాలపురం గ్రామానికి చెందిన స్వాతి శ్రీకి, కిర్లంపూడి మండలానికి చెందిన భూ పాలపట్నం గ్రామానికి చెందిన గంగోత్రి కి, అదే గ్రామానికి చెందిన రామలక్ష్మి కి రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గౌతమికి ఐదు జంటలకు లక్ష రూపాయలు పెళ్ళికానుకలు అందించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఎన్నికలలో గ్రామాలు తిరుగుతూ నా సొంత ఈ జెండాలో భాగంగా ఆడబిడ్డ పెళ్లికి 20,000 రూపాయలు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందించాలని హామీ ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా నియోజవర్గం పరిధిలో ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20000 రూపాయలు పెళ్ళి కానుక అందిస్తున్నామని ఐదు గంటలకు 20 వేల రూపాయలు చెక్కులు అందించామని ఎవరైనా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే తొమ్మిది రోజులు ముందు జగ్గంపేట లోని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారికి పెళ్ళికానుక అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరం రెడ్డి కాశిబాబు, ఏలేటి బాబి, రాయి సాయి, కంటే ఉదయ భాస్కర్, గద్దె మారుతి తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



