హిందూస్మశాన వాటికను పట్టించుకోని అధికారులు
ఫిర్యాదులు చేసినా స్పందించని మున్సిపల్ అధికారులు.
యానం ఫిబ్రవరి 16 (అఖండ భూమి)
యానంలో సుమారు 80 వేలకు పైగా జనాభా అందుకు తగ్గట్టు యానాం హిందూ స్మశానవాటిక లేక పోవడంతో యానాం ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,
రోజు-రోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు అందుకు తగ్గట్టు ప్రజలకు సామాజిక అవసరాల కోసం యానం హిందూ స్మశాన వాటికలో ఏర్పాట్లను చేయడంలో యానాం మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందారని,
ఎక్కడపడితే అక్కడ అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి ఉందని మున్సిపల్ మరియు ఉన్నతాధికారులపై అధికారులపై మండిపడ్డ
యానం ప్రజలు..
యానం టైడల్ లాక్ వద్ద ఉన్న హిందూ స్మశాన వాటికలో
యానాం మున్సిపల్ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ అధికారులకు- ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా నిద్రపోతున్నారని యానం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా యానం టైడల్ లాక్ వద్ద ఉన్న హిందూ స్మశానవాటిక లో దహన సంస్కారాల చేద్దామంటే విరిగిపోయిన బెడ్లలో శవ-దహన సంస్కారాలు చేసే పరిస్థితి నెలకొందని మరియు దహన సంవత్సరములు చేసిన తర్వాత స్నానాలు చేయడానికి కూడా నీళ్ల సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో యానాం మున్సిపల్ కమిషనర్ కి మరియు ప్రాంతీయ పరిపాలన అధికారికి ఫిర్యాదు చేసినా సరే ఫిర్యాదును ఫిర్యాదుగానే చూస్తున్నారు తప్ప ఇది ప్రజా-సమస్యగా చూడని అధికారులు యానంలో ఉన్నారని ముఖ్యంగా యానాం హిందూ స్మశానవాటికలో సమస్యలతో హిందువులు ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పడం లేదని శవాన్ని కాల్చడానికి ఇరిగిపోయిన బెడ్లలలో శవాన్ని కాల్చలేక ఆరు-బయటనే పుల్లలు పేర్చి శవాన్ని కాల్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని
శవ-దహనం కోసం ఏర్పాటు చేసిన నాలుగు-బెడ్లు నిరూపయోగంగా మారిపోయాయని
సంబంధిత అధికార్లు స్పందించి యుద్ధప్రాతిపదికన కొత్త-బెడ్లు మరియు నీళ్ల సదుపాయం ఏర్పాటు చెయ్యాలని
సంబంధాధికారులు యానం ప్రజలు కోరుతున్నారు.హిందూ స్మశాన వాటికపై
మున్సిపల్ అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని
యానం నియోజకవర్గ ప్రజలపై ఎందుకు-ఈవివక్ష చూపుతున్నారని మున్సిపల్ అధికారులపై మండి పడుతున్న యానాం ప్రజలు
ఇదే విధంగా అధికారులు ఉన్నట్లయితే యానాం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట అంత్యక్రియలు చేయవలసి వస్తుందంటున్న యానాం ప్రజలు…..