ఇంటర్నెట్‌లోనే సగం భారతం

ఇంటర్నెట్‌లోనే సగం భారతం

 

అంతర్జాలాన్ని వాడుతున్న 75.9 కోట్ల మంది

న్యూఢిల్లీ అఖండ భూమి : దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. దశాబ్దం క్రితం వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఇంటర్నెట్‌ నేడు పల్లెలకూ అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఐఏఎంఏఐ, కాంతర్‌ సంస్థ ఉమ్మడి నివేదిక ప్రకారం.. మొదటిసారిగా దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య మొత్తం జనాభాలో 50 శాతం దాటింది. ప్రస్తుతం 75.9 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్‌ వాడుతున్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. ఈ సంఖ్య మరింత పెరగనున్నదని, 2025 నాటికి 90 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఏడాదిలో పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య గతం కంటే 6 శాతం పెరగగా, గ్రామీణ ప్రాంతాల్లో 14 శాతం పెరిగింది. మహిళల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటివరకు ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 54 శాతం పురుషులే కాగా, 2022లో కొత్తగా ఇంటర్నెట్‌ వాడటం ప్రారంభించిన వారిలో మాత్రం 57 శాతం మహిళలే ఉన్నారు.

ఇంటర్నెట్‌ నుంచే వార్తలు ఇంటర్నెట్‌ నుంచి వార్తలు తెలుసుకునే భారతీయుల సంఖ్య కూడా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 52 శాతం మంది వినియోగదారులు ఇంటర్నెట్‌ నుంచే వార్తలు తెలుసుకుంటుండగా, పట్టణ ప్రాంతాల్లో వీరు 37 శాతం మంది ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!