డాక్టర్ చల్లాను ఘనంగా సన్మానించిన రజక సంఘం వారు.
ఆలమూరు ఫిబ్రవరి 16 (అఖండ భూమి న్యూస్):మండల కేంద్రం ఆలమూరులో జరిగిన రజకుల బల్లల పండుగ సందర్భంగా సత్తెమ్మ తల్లి సంబరం ఆదివారం ఎంతో ఘనంగా జరిగినది.గతంలో స్థానికంగా నివాసం ఉండె రజకులు బతుకుతెరువు కోసం హైదరాబాదు వలస వెళ్ళి అక్కడే ఉంటున్నారు.సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునే సత్తెమ్మ తల్లి సంబరం సందర్భంగా వారంతా విచ్చేసి అందరు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు చాలా సంతోషం వ్యక్తం చేసారు.రజక సంఘం ఆహ్వానం మేరకు సత్తెమ్మ తల్లి సంబరానికి విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు పై పూలవర్షం కురుపించి ఆయనను ఘనంగా సన్మానించిన రజకుల ఉత్సవకమిటీ వారు.ఈ సందర్భంగా డాక్టర్ చల్లా మాట్లాడుతు రజకుల బల్లల పండుగ సందర్భంగా అందర్ని కలవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో దువ్వాపు సుబ్బారావు,ఎరుకొండ ముసలయ్య,ఎరుకొండ గణేష్,టేకి గంగరాజు,ఇల్లూరి శ్రీను,ఎరుకొండ సత్తిబాబు,ఎరుకొండ మణి,ఎరుకొండ ఉమామహేశ్వరరావు,నందమూరి ప్రసాద్,ఎరుకొండ సత్తిబాబు,తులసి నాగార్డున తదితరులు పాల్గొన్నారు.