జాతీయస్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలలో విఆర్వో అబ్బులు ప్రతిభ.
ఆలమూరు ఫిబ్రవరి 16 (అఖండ భూమి వెబ్ న్యూస్):ఈనెల16 తేదీన అనగా నిన్న ఆదివారం ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా అద్దంకి శ్రీ సీతారామ కళ్యాణం మండపంలో నిర్వహించిన జాతీయస్థాయి ఓపెన్ కరాటే కుంగ్ ఫు తైక్వాండో పోటీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీను జిల్లా కలవచర్ల గ్రామానికి చెందిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ విఆర్వో తాతపూడి అబ్బులు వెపన్ కత్తి ప్రదర్శన విభాగములో గోల్డ్ మెడల్ సాధించారు,
అబ్బులులను రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అదినే రవికుమార్, ఆంధ్ర తెలంగాణ ఆస్మా జనరల్ సెక్రటరీ రూపస్ పాల్, ఆర్గనైజర్ పి రాంబాబు, గ్రాండ్ మాస్టర్ దుర్గారావు, తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా అబ్బులు మాట్లాడు చిన్ననాటి నుండి ఈ మార్షల్ ఆర్ట్స్ లో మెలకువలు తెలుసుకుని, వేలమందికి శిక్షణలు ఇస్తూ ఇప్పటికీ ప్రాక్టీస్ లో ఉండడం వలన నా కష్టానికి ఫలితాలు దక్కుతున్నాయని ఆయన అన్నారు.