పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్తను రిక్షాలల్లోనే వేయాలి.
పంచాయతీ సెక్రెటరీ నలగాటి శివ కోటేశ్వరరావు
పెద్దదోర్నాల అఖండ భూమి వెబ్ న్యూస్ :
చెత్తను చెత్త రిక్షాల్లోనే వేయాలని పెద్దదోర్నాల పంచాయితీ కార్యదర్శి నలగాటి శివ కోటేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ వివిధ షాపుల వారికి అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి రోజు ఇంటి ఇంటికి చెత్త సేకరణలో భాగంగా ప్రతి ఒక్కరికి తడి చెత్త, పొడి చెత్త మరియు హానికరమైన వెత్త వేరు. వేరు గా చెత్త రిక్షాలో వేయాలి. వేసిన చెత్తను క్లాప్ మిత్రాలు (హరిత రాయబారులు, వారితో (చెత్తనుండి సంపద తయారీ కేంద్రం)నకు తరలించి తడి చెత్తను వర్మీ కంపోస్ట్ గా తయారు చేసి పొడి చెత్తను వేరు చేసి ప్రతి గురువారం వర్మీ మరియు పొడి చెత్తను అందుబాటులో ఉన్ననిమిత్తం సేల్ చేయబడునని తెలిపారు.