మయూర వాహనసేవ పే శ్రీ స్వామి అమ్మవార్ల..!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం దేవస్థానం అఖండ భూమి దినపత్రిక మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజైన శనివారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి.తరువాత యాగశాల యందు శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి.అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేయబడ్డాయి.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు,రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి.అదే విధముగా ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు,
హోమాలు జరిపించబడుతాయి.
మయూర వాహనసేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా శనివారం
సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు మయూరవాహనసేవ జరిపించబడుతుంది.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడుతాయి. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరుగనున్నది.
గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం,కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ కర్ణాటక డోలు కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం,తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం,గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయి