శ్రీశైలం రుద్ర పార్క్ పరిసర ప్రాంతాల్లో చిరుత మృతి

 

శ్రీశైలం రుద్ర పార్క్ పరిసర ప్రాంతాల్లో చిరుత మృత

నంద్యాల జిల్లా శ్రీశైలం అఖండ భూమి న్యూస్

శ్రీశైలం ఎంక్లోజర్ శ్రీశైలం బీట్ నందు రుద్రా పార్క్ సమీప అటవీ ప్రాంతములో గోడపై మృత్యువాత పడిన ఒక చిరుతపులి కళేబరం గురించి ఒక స్థానిక వార్త లో రావడం జరిగింది. వెంటనే శ్రీశైలం రేంజ్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతపులి మృత కళేబరం ను రుద్రా పార్క్ సమీప గోడపై కనుగొనడం జరిగింది. ప్రాధమిక దర్యాప్తులో తెలిసినది ఏమనగా చిరుత పులి చనిపోయీ వున్నా ప్రదేశము నుండి చిరుత పులి మృత కళేబరం వున్న ప్రదేశము వరకు ఆక్కడక్కడ చిరుతపులి యొక్క అవశేషాలు ఎముకలు, వెంట్రుకలు, గోర్లు గుర్తించడం జరిగింది ఈ మృత కళేబరం వాస్తవముగా వున్నా ప్రదేశము కంటే,రుద్రా పార్క్ ప్రహరి గోడ నుండి చిరుత పులి చనిపోయీ వున్నా ప్రదేశము వరకు సుమారు 30 మీటర్ల దూరం వున్నది. ఈ చిరుతపులి మృతిలో మానవ ప్రమేయం వున్నట్లు ఎలాంటి ఆధారాలు ఏమియు లేవు అని ప్రాధమిక దర్యాప్తులో నిర్ధారణ అయినది.

 

ఆధారాలు లేకుండా చిరుత పులిని వేటడారని మరియు చిరుతపులి పంజా ని  కట్ చేసారని అవి అలాంటి ఆధారాలు ఏమి లేవుఅనిఅవాస్తవాలను మాధ్యమాలలో ప్రచురించడం జరిగింది. ఈ విధంగా అర్థం లేని పోస్టులు పెడితే పెట్టిన వారికి అటవీ శాఖ నుండి  తగిన చర్యలు ఉంటాయనిఅటవీ జంతువులకు సంభందించిన అవాస్తవాలు మరియు నిర్ధారణ కానటువంటి వార్తలు ప్రచురితం చేయరాదు. అనియం. ఇవి వాస్తవాలకు అనుకూలంగా ఉండేలా ప్రచురించడం మంచిదని  మహమ్మద్ అబ్దుల్ రవూఫ్, సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్, శ్రీశైలం,  సుబాష్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీశైలం, కె. మదన్ కుమార్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, శ్రీశైలం, డాక్టర్ జుబేర్ వలి వెటర్నరీ ఆఫీసర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు డాక్టర్ అరుణ్ వెస్లీ, వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ వెటర్నరీయన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జే. రవీంద్రనాథ్ ఠాగూర్ కలసి వారి ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం చిరుత పులి శరీర భాగాల సాంపిల్స్ ను సంభంధిత ల్యాబోరేటరికి పంపడం జరిగింది. అని అటవీ క్షేత్ర అధికారి శ్రీశైలం వారు మీడియాకు తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!