ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలి
వీటి అమలుకు కావలసిన నిధులను ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలి
హామీల అమలకు కావలసిన నిధుల సేకరణకు 100 కోట్ల ఆస్తిపైబడి ఉన్న వారందరికీ ప్రజా సంక్షేమ ట్యాక్స్ ని అమలు చేయాలి
ఎంసీపీఐ(యూ)తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్ఐ మురళి వినతి పత్రం
బెల్లంపల్లి ఫిబ్రవరి 28(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లో శుక్రవారం ఎంసిపిఐ(యు) పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఎంసీపీఐ(యూ)పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్,జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ..గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను నిర్బంధ విధానాలతో స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించి ప్రశ్నించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే స్వేచ్ఛ వాతావరణం లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఓడించి ఉన్న ఆశలతో ఆశలతో మీకు ఓటు వేసి అధికారంలోకి తెచ్చారు అందుకోసం ప్రజలు చేసిన త్యాగం కేసిఆర్ రాష్ట్ర ఖజానాను దివాలా తీయించి మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మీకు అనేక సభల్లో చెబుతూనే దివాలా తీసిన రాష్ట్ర బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలకు అరచేతుల వైకుంఠ చూపించి ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు.
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి టిఆర్ఎస్ అప్పులపై చేస్తున్న ప్రచారం కన్నా చేసిన ఎన్నికల ఆరు గ్యారెంటీ ల అమలుపై దృష్టి పెట్టడంలో వైఫల్యం చెందారు.ఈ అవకాశం కోసం కాచుకొని ఉన్న ఫాసిస్ట్ బిజెపి నియంతృత్వ అవినీతి విఆర్ఎస్ లు తిరిగి ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న ప్రచారానికి మీ పాలన వైఫల్యమైన కారణం అవుతున్నది
1,ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి, వీటి అమలుకు కావలసిన నిధులను ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలి.
2,హామీల అమలకు కావలసిన నిధుల సేకరణకు 100 కోట్ల ఆస్తి పైబడి ఉన్న వారందరికీ ప్రజా సంక్షేమ టాక్స్ ని అమలు చేయాలి
3,బడ్జెట్లో విద్య, వైద్య, మహిళ, యువజన సంక్షేమ రంగాలకు 40 శాతం నిధులు కేటాయించాలి.
4,గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములలో ఉన్న పేద ప్రజలకు చట్టబద్ధత కల్పించి పట్టాలు ఇవ్వాలి వారందరికీ ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలి.
5,ప్రభుత్వ భూములను చట్టంలో ఉన్న వసుగులు ఆసరాగా చేసుకుని రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమంగా చేసుకున్న పట్టాలను రద్దుచేసి పేద ప్రజలకు పంపిణీ చేయాలి.
6,ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మంజూరు చేయాలి.
7,మిర్చి రైతం గానికి రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో బోనస్ ప్రకటించి కొనుగోలు చేసి మిర్చి రైతాంగాన్ని పసుపు రైతాంగాన్ని ఆదుకోవాలి•
8,జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను 6 నెలల్లో పూర్తి చేయాలి• ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
9,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేద ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు నిర్వహించాలి.
10,శాసనసభ చట్ట సభల్లో బీసీలకు బిసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించే తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వంపై వ్యక్తిని దేవాలయం•
11,విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి• కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానించాలి రానున్న బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి.ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి•ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి•ప్రైవేట్ విద్యా రంగాన్ని రద్దు చేయుటకుచర్యలు తీసుకోవాలి•
12, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి పెంచే విధంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించి ఢిల్లీకి అఖిలపక్ష పార్టీల బృందాన్ని తీసుకుపోవాలి•ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే మీరే బాధ్యులు అవుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్,బెల్లంపల్లి మండల కార్యదర్శి ఆరెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు…