కర్నూలు, మార్చి 01 అఖండ భూమి వెబ్ న్యూస్ :
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం, పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీలేఖ మీద చెట్టు విరిగి పడడంతో గాయాలై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో అడ్మిట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినిని పరామర్శించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విద్యార్థినికి మెరుగైన వైద్య సేవలు అందచేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన జిల్లా కలెక్టర్