శస్త్ర చికిత్స పేషంట్ వద్దకు వెళ్లి పింఛన్ అందించిన దేవుడు

శస్త్ర చికిత్స పేషంట్ వద్దకు వెళ్లి పింఛన్ అందించిన దేవుడు

నాతవరం మండలం లోని గునుపూడి గ్రామపంచాయతీ కి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు నీటి సంఘం ప్రెసిడెంట్ సబ్బవరపు దేవుడు మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటారు. అదే గ్రామానికి చెందిన మహిళ కొండ్రు సింహాద్రమ్మ ఎడమ కాలికి నెలరోజుల క్రితం శస్త్ర చికిత్స జరగింది. దీనితో ఆమె నడవలేని స్థితిలో అల్లిపూడి గ్రామంలో తన బంధువుల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ నెల పెన్షన్ అందుకోలేకపోతున్నానని గ్రామ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు సబ్బవరపు దేవుడు దృష్టి కి తీసుకురాగా వెంటనే స్పందించి స్వయంగా ఉద్యోగిని వెంటబెట్టుకుని అల్లిపూడి గ్రామానికి వెళ్లి ఆమెకు పెన్షన్ అందజేశారు. సేవలో నేటి యువతకు స్ఫూర్తి దాయకం గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ భరోసాను ఇస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!