శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లపై కేసు నమోదు

 

శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లపై కేసు నమోదు

నంద్యాల జిల్లా శ్రీశైలం అఖండ భూమి న్యూస్,

శ్రీశైలంలో నకిలి టికెట్లు కేటుగాళ్లపై శ్రీశైలం  పోలీసులు కేసు నమోదు చేశారు దేవస్థానం చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ మదుసూదన్ రెడ్డి నకిలి దర్శనం టికెట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిందితులు శ్రీశైలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అయితే వీరిలో ఒకరు గతంలో కూడ నకిలి టికెట్లు విక్రయిస్తూ దేవస్థానం సిబ్బందికి పట్టుబడ్డారు కాని అప్పట్లో అధికారులు మొదటి తప్పుగా బావించి మందలించి వదిలేశారు శ్రీశైలంలో నకిలీ టికెట్ల అమ్మకాల కేటుగాళ్ల ఆగాడాలు ఎక్కువయ్యాయి భక్తులను మోసం చేస్తూ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని నకిలి టికెట్లు భక్తులకు కట్టపెడుతున్న సంఘటన శ్రీశైలంలో చోటుచేసుకుంది

శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం టికెట్ల గోల్మాల్ జరగడంతో దేవస్థానం చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ మదుసూదన్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫీర్యాదు స్వీకరించిన శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేశారు  ఫిబ్రవరి 14న కొందరు దళారులు భక్తులకు మాయమాటలు చెప్పి నకిలీ టికెట్లు అంటగట్టారు. ఉచిత క్యూలైన్లలో గంటల కొద్ది వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. దేవస్థానం ఆన్లైన్ ద్వారా భక్తులకు విక్రయించే రూ.500 టికెట్ ను నకిలీ టికెట్గు తయారు చేసి రూ.900 కు విక్రయించ్చి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడో జారీ చేసిన టికెట్లపై తేదీలను మార్చి నకిలీ రబ్బరు స్టాంపులతో విక్రయించారు.

సాధారణంగా స్పర్శ దర్శనం టికెట్టు ఆన్లైన్ ద్వారానే పొందాలి స్పర్శ దర్శనం టికెట్లు పొందాలంటే ఆధార్ తప్పనిసరి. కొందరు కేటుగాళ్లు ఈ నకిలీ టికెట్లకు ఆధార్ జత చేసి భక్తులకు విక్రయించారు. వీటిపై నిఘా పెట్టిన కొందరు అధికారులు ఈ విషయాన్ని ఈవో ఎం. శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విశషయమై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో కేటుగాళ్ల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి అయితే శ్రీశైలంలో నకిలి టికెట్లు క్రయ విక్రయాలపై హాట్ టాఫిక్ మారింది

Akhand Bhoomi News

error: Content is protected !!