సీతానగరంలో పల్లె పండుగ, ఉగాది పంచాంగ శ్రవణం
పల్లెల అభివృద్ధి కోసమే పల్లె పండుగ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట మార్చి 30: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు అజెండా అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆదివారం సీతానగరం గ్రామంలో నిర్వహించిన పల్లె పండగలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామస్తులందరూ సాంప్రదాయ వస్త్రధారణలో మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం చేశారు. ఉగాది పండుగ పురస్కరించుకుని సుబ్రమణ్య స్వామి గుడి వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించి 12 రాశుల వారి జాతక ఫలాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు పల్లె పండుగ, ఉగాది పంచాంగ శ్రవణం అమరావతిలో ముఖ్యమంత్రి గ్రామాల్లో ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ఈరోజు సీతానగరంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని ముఖ్యంగా దీని ఉద్దేశం పేద ప్రజలను ఆర్థికంగా ముందుకు నడిపించాలని పి ఫోర్ కార్యక్రమం తీసుకున్నామని ముందుగా సీతానగరం గ్రామం నుండి ఐదుగురిని ఎంపిక చేసి గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో వారికి అన్ని విధాల ఆర్థిక వనరులను సమకూర్చి వారిని పేదరికం నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడినుండే ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పోతుల మోహనరావు, జీను మణిబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ జోగారావు, బొల్లంరెడ్డి రామకృష్ణ, మండపాక అప్పన్న దొర, పంచాయతీరాజ్ డి ఈ ఉమాశంకర్, జేఈ నారాయణమూర్తి, ఎండిఓ చంద్రశేఖర్, ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, కాకర్ల కృష్ణాజి, తాతినేని నాగేశ్వరరావు, ఈర్పిన శ్రీను, కుదప మురళి, పిండి రెడ్డమ్మ, ఆత్మకూరి వెంకటకృష్ణ, గూ డపాటి సత్యనారాయణ అధిక సంఖ్యలో సీతానగరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.